దివ్యాంగులకు అన్నదానం

31-10-2026 | 05:08pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామ  సర్పంచ్ కోదాటి సాయి కిరణ్ జన్మదినాన్ని  పురస్కరించుకొని శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ దివ్యాంగుల కేంద్రంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగులు కోదాటి సాయి కిరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గట్టపల్లి సర్పంచ్ దేవేందర్, ఏబీవీపీ నాయకులు రాసురి ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా పేదలకు, మానసిక వికలాంగులకు, దివ్యాంగులకు  అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవాభావాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని  కోరారు.ఈ కార్యక్రమంలో సాయి కిరణ్ వెంట స్నేహితులు పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు