హైదరాబాద్‌కు కదిలిన రైస్ మిల్లు కార్మికులు!
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్, అక్టోబర్ 25 (విజయ క్రాంతి): సీఐటీయూ(CITU) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహా ధర్నాకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన రైస్ మిల్లు కార్మికులు తరలివెళ్లారు. కార్మికులు ప్రయాణిస్తున్న వాహనాలను సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు నష్టం కలిగిస్తూ యజమానులకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్(Labour Code)లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలని, కార్మికులకు పని భద్రత, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైస్ మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్న రైస్ మిల్లు కార్మికులను తాండ్ర అంజయ్య అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు, సీఐటీయూ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య, రైస్ మిల్లు ఆపరేటర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, వీరగోని కిరణ్ గౌడ్, దండి సంపత్, దుర్గం మహేందర్, విలాస్, ఆసరి మహేష్, ప్రసాద్, సదయ్య, ప్రభాకర్, లచ్చయ్య, లక్ష్మయ్య, రైస్ మిల్లు లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు పోగుల తిరుపతి, మంజూర్, అబ్బా, రియాజ్, రబ్బాని, శ్రీనివాస్, మాతంగి శంకర్, హమాలీ సంఘం నాయకులు లచ్చన్న, నరేష్, శీను, రాజయ్య తదితరులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు