అనుమానాస్పద కార్యకలాపాలు

03-10-2026 | 04:46pm

చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తాం

మాజీ బీజేపీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్

రామగిరి,(విజయక్రాంతి) పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని చారిత్రక రామగిరి ఖిల్లా(Ramagiri Fort) ప్రాంతంలో ఇటీవల కొందరు వ్యక్తులు జెండాలు ఏర్పాటు చేయడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, జంతుబలి ఇచ్చినట్లు, కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం వెలువడుతోందని మాజీ బీజేపీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్(Former BJP MPTC Forum President Molumuri Srinivas) తెలిపారు.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఖిల్లా ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలు ఎవరి అనుమతితో నిర్వహించారు? ఎవరు నిర్వహించారు? వాటి ఉద్దేశం ఏమిటన్న అంశాలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

రామగిరి ఖిల్లా చారిత్రక వారసత్వ సంపద అని, దాని పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో సెంటనరీ కాలనీ అధ్యక్షుడు తీగల శ్రీధర్, మెరుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు