రామగిరి లో పలు కుటుంబాలకు మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ

27-10-2026 | 03:30pm

మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

రామగిరి, అక్టోబర్27 (విజయక్రాంతి) రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామంతో(Nagepalli Village) పాటు బేగంపేట గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. నాగేపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ కార్యదర్శి శనివారపు జైపాల్,

తాటి శ్రీనివాస్ గౌడ్, దూడం వెంకటస్వామి, పొన్నం మధు గౌడ్‌ల చిత్రపటాలకు మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా బేగంపేట గ్రామానికి చెందిన ముత్తే అరవింద్ కళ్యాణ్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు, వారి బాధలో పాలుపంచుకున్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు కష్టసుఖాల్లో అండగా ఉంటూ, బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల అధ్యక్షుడు తులసిరాంగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు