చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం
జడ్జి దుర్గం గణేష్
కాట్నపల్లి రైతు వేదిక ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు
సుల్తానాబాద్, అక్టోబర్ 03 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్(Sultanabad Junior Civil Judge Durgam Ganesh) ఆధ్వర్యంలో కాట్నపల్లి రైతు వేదిక(Katnapalli Rythu Vedika)లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు(Legal Knowledge Conference)లో ప్రతి ఒక్కరూ ప్రాథమిక చట్టాలపై(Fundamental laws) అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో పాటు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ఆయన తెలిపారు. సమాజంలోని పేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఉద్దేశంతోనే న్యాయసేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాలని, న్యాయస్థానాలు అందరికీ సమానమైన న్యాయం అందించడానికి కట్టుబడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు రక్షణ కోసం చట్టాలు, వ్యవసాయ శాఖ పథకాలు ఉన్నాయని వాటిని గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్, కాట్నపల్లి సర్పంచ్ ఓగుల పూజా రాజేందర్, మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నార మనోహర్, న్యాయవాదులు పెగడ శ్యామ్ సుందర్, సామల రాజేంద్ర ప్రసాద్, గుడ్ల వెంకటేష్, ఆకారపు రామకృష్ణ రెడ్డి, ఉపసర్పంచ్ దాసరి రాయమల్లు,మండల వ్యవసాయ అధికారి పైడి తల్లి, ఏఈఓలు రాజు, ప్రశాంత్, అనుష, పద్మ, రవితేజ, ఆనందరావుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.