సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డిఎస్పి శ్రీనివాస్ రావు
ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): సైబర్ నేరగాళ్లు(Cyber Crimes) మీకు ఏదో దగ్గర వారిలాగా ఫోన్లో చేసి మీ ఓటీపీలు, ఇతరేతర సమాచారంతో వారి వలలోకి తీసుకొని మీ బ్యాంకులో ఉన్న డబ్బులను కాజేస్తారని వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు(DSP Srinivas Rao) అన్నారు. శనివారం ఎల్లారెడ్డి మండలం(Yellareddy Mandal)లోని సబ్దల్పూర్ గ్రామపంచాయతీ లో ప్రజలకు సైబర్ నేరాలు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలు మారకద్రవ్యాలు సైబర్ నేరాల పట్ల రోడ్డు భద్రత నియమాల పట్ల తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్ఐ రాజు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.