స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

03-10-2026 | 08:34pm

గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ పరిధిలోని కండ్లకోయలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

మున్సిపల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు:గరిసెల సురేందర్ ముదిరాజ్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్(Cyberabad Municipal) కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ పరిధిలోని కండ్లకోయ(Kandlakoya)లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ(Smart Ration Cards Distributed) కార్యక్రమం జరిగిందని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Enumula Revanth Reddy) సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం స్మార్ట్ రేషన్ కార్డుల పథకం పౌర సరఫరాల శాఖ అధికారి లక్ష్మీకాంత్ తో పాటు రేషన్ డీలర్ లావణ్య ఇందిరమ్మ కమిటీ సభ్యులు బొక్క శ్రీకాంత్ రెడ్డి కర్రోళ్ళ సంతోష్ ల సమక్షంలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయడం జరిగిందని సురేందర్ ముదిరాజ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కండ్లకోయ గ్రామ మాజి సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి.మేడ్చల్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, మేడ్చల్ సొసైటీ మాజి వైస్ దామన్నగారి నరహరి, రాజేందర్ ముదిరాజ్, సాకరబోయిన వెంకటేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు