22ఏ నిషేధిత ఆస్తులపై సమగ్ర సమీక్ష చేపట్టాలి

16-09-2026 | 05:39pm

కలెక్టర్‌కు టీడీపీ నేతల వినతి

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రిజిస్ట్రేషన్ చట్టం–1908లోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో తప్పుగా, పరిమితికి మించి ఆస్తులను చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గుళ్లపల్లి ఆనంద్(TDP Adilabad Parliamentary Constituency Convener Gullapalli Anand) అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత(District Collector K. Haritha)కు టీడీపీ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా 22ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదైన భూములు, ఆస్తులపై సమగ్రంగా రికార్డులను పరిశీలించి, తప్పులను సవరించాలని కోరారు.

సెక్షన్ 22ఏ పరిధి, దాని శాసన ఉద్దేశానికి అనుగుణంగా రికార్డులను సమీక్షించి, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెరుగు ఆత్మారాం, కాగజ్‌నగర్ మండలానికి చెందిన చెల్లూరి శంకర్, ఎండీ మాకూబుల్ హుస్సేన్, కర్ణే సంతోష్, దహెగాం మండలం మధుకర్, ఆసిఫాబాద్ మండలం ప్రశాంత్, షకీర్, తిర్యాణి మండలం రమేష్, రవి, ఇప్ప సంజీవ్, గులాబ్‌రావు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు