25 న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి
- సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు పిలుపు....
- మహాధర్నా పోస్టర్ లు ఆవిష్కరణ
సుల్తానాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఈ నెల 25 న ఆదివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్(Indira Park in Hyderabad) వద్ద జరుగు మహాధర్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ హమలి కార్మిక భవన్లో హమాలీ కార్మికులు, నాయకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు.
కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 42 వేల రూపాయలుగా నిర్ణయించాలని, కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని రైస్ మిల్లు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు, అక్టోబర్ 25న జరిగే ఈ ధర్నాలో రైస్ మిల్లు ఆపరేటర్స్, గుమస్తాలు, లారీ డ్రైవర్స్, హమాలీ కార్మికులు, మహిళా కూలీలు తదితర పారిశ్రామిక కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, పెద్దపల్లి జిల్లా మున్సిపల్ సంఘం కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి , సుల్తానాబాద్ మండల నాయకులు మాతంగి రాజమల్లు, రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి.హమాలీ సంఘం అధ్యక్షులు మీనుగు రాజు, ఉపాధ్యక్షులు కంకణాల కొమురయ్య, సారయ్య, రాజయ్య, సదయ్య, నరేష్ రైస్ బిల్ ఆపరేటర్స్ విలాస్, స్వామి, తిరుపతి, మాతంగి రాజమల్లు, సదయ్య, ప్రసాద్, లక్ష్మణ్, వెంకటేష్, శంకర్, రవి, మహేందర్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.