ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ హనుమంతు.
పెంట్లవెల్లి అక్టోబర్ 23: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని కెవిపిఎస్ కేజీ కేఎస్ సిఐటియు రాష్ట్ర కమిటీ(KVPS, KGKS, and CITU State Committee) పిలుపులో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అంబేద్కర్ విగ్రహం ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని దేశంలో తొలగించిన 13 కోట్ల ఓటర్లను తిరిగి ఎక్కించాలని అలాగే సర్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ ముందు ప్లాకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేజీ కేఎస్ జిల్లా కన్వీనర్ ఏల్లగౌడ్.కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షడు ఎస్ హన్మంతు మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా ఓట్లను తొలగించడం భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి వారికి ఓటు వేసే అర్హత కోల్పోయే విధంగా చేశారని అలాగే త్రీసభ్య ఎలక్షన్ కమిషన్ సర్ ప్రక్రియను ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ లు వ్యతిరేకించిన ఏకపక్షంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సర్ ను ముందు కొనసాగించరాని దాని ఫలితంగా దాదాపు కొన్ని కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటు హక్కు కోల్పోయినటువంటి వారందరికీ తక్షణమే ఓటు నమోదు అవకాశం కల్పించాలని ఆ పదవి నుంచి తక్షణమే జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని అక్కడ పేర్లు లేకపోతే వేరే వారి చిరునామా పెట్టి ఎక్కించుకోవడానికి అనుమతి లేకుండా పోయిందన్నారు.అంతా తప్పులతలకగా అర్హులైనటువంటి వారికి అన్యాయం జరిగిందని అన్నారు.
సర్ ప్రక్రియ పై ఆందోళన చేస్తున్నటువంటి ఢిల్లీ యువకులకు నిర్బంధాన్ని ఆపాలని నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని దీన్ని వ్యతిరేకిస్తే బిజెపి ప్రభుత్వానికి పుట్ట గతులు ఉండవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు బాలరాజు. శ్రీనివాసులు. మంజునాథ్. బాలస్వామి. లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.