రామగిరి వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా చేతిసుదాకర్
మంథని, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): రామగిరి మండల వార్డు మెంబర్ల ఫోరం(Ramagiri Ward Members Forum) నూతన అధ్యక్షుడిగా పన్నూరు గ్రామానికి చెందిన వార్డు మెంబర్ చేతిసుదాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రత్నాపూర్ రైతు వేదికలో మంథని నియోజకవర్గ వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జ్ చొప్పరి సంతోష్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని పార్టీలకు చెందిన వార్డు మెంబర్లు హాజరయ్యారు.
అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొరకొప్పుల తులసి రామ్‌గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్ గౌడ్ నూతన అధ్యక్షుడు చేతిసుదాకర్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తులసి రామ్‌గౌడ్ మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబు నాయకత్వంలో మంథని నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్లు పాల్గొన్నారు.