విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ
08-09-2026 | 11:19pm
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అందిస్తున్న ప్రభుత్వ పాఠశాల యూనిఫాంలను, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు(MLA Chintakunta Vijaya Ramana Rao) ఆదేశాల మేరకు మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ 7వ వార్డు పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్ అందించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం విద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సుల్తానాబాద్ టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు బండ మాధవి, డాక్టర్ సింధుజ, ఆర్ పి వసుధ, రాజు, గెల్లు వెంకటేష్, అమ్ముల ఉదయ్, దాసరి విజయ్, సిహెచ్ యాదగిరి పలువురు పాల్గొన్నారు.