ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మ దహనం

09-09-2026 | 12:47am

భూత్పూర్: దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు(MLC Tata Madhu) చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ మంగళవారం భూత్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణంలోని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి(Municipal Chairman Drathrat Balakoti) మాట్లాడుతూ దళిత బిడ్డ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాత మధు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

అధికారం కోల్పోయామని అక్కసుతో  దళిత నాయకత్వం ఎదుగుతుంటే చూసి ఎవరు లేక రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడడం సరైనది కాదన్నారు. స్పీకర్ తల్లిని అవమానించేలా మాట్లాడడం అందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. వెంటనే ఎమ్మెల్సీ తాత మధును వెంటనే బర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లాలూ నాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షులు బోరింగ్ నర్సింలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్యానాయక్, నరేందర్, మల్లేష్, వెంకటేష్, యాదయ్య తో పాటు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు