కాంగ్రెస్ 420 హామీలను నెరవేర్చాలి

09-09-2026 | 12:41am

భూత్పూర్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్(Former Municipal Chairman Basvaraj Goud) ఆధ్వర్యంలో భూత్పూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.

ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ఇప్పుడు అవి నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు గద్దె దింపుతారు అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ పాలన అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, నారాయణ గౌడ్, తూము శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, ఆగిరి వెంకటేష్, సాకీర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు