అక్షరాస్యత అవగాహన ప్రచార ర్యాలీ

09-09-2026 | 01:05am

కోదాడ,(విజయ క్రాంతి): అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం(International Literacy Day) సందర్భంగా కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల(Zilla Parishad Boys' High School) విద్యార్థులు ఉపాధ్యాయులు మంగళవారం "అక్షరాస్యత - అవగాహన ప్రచార" ర్యాలీ(Literacy - Awareness Campaign Rally) నిర్వహించారు. అక్షరాస్యతను పెంపొందిద్దాం జ్ఞాన సమాజాన్ని నిర్మిద్దాం, అక్షరాస్య సమాజమే అభివృద్ధి చెందిన సమాజం, అక్షరాస్యతతో అజ్ఞానాన్ని తొలగించి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం.. నినాదాలుతో కోదాడ పట్టణం ప్రధాన వీధిలో  అక్షరాస్యత గురించి  పట్ల అవగాహన , ప్రచార ర్యాలీ నిర్వహించడం , పాఠశాల విద్యార్థులకు "అక్షరాస్యత - ప్రభావాలు" అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ఉపాధ్యాయులు డి. లింగయ్య, ఎం. వీర బ్రహ్మచారి, ఎం జానకి రామ్, జి. సైదయ్య, శ్రీనివాస్ రావు, బడుగుల సైదులు, ఎస్ కె సిద్ధిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు