తాతా మధు దిష్టి బొమ్మ దహనం
09-09-2026 | 12:44am
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మల్కారం క్రాస్ రోడ్డులో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంఎల్సీ తాతా మధు(MLC Tata Madhu) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Assembly Speaker Gaddam Prasad)పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి, తాతా మధు దిష్టి బొమ్మను దహనం చేశారు. పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా కొంత సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.