పాలిటెక్నిక్ కళాశాల భూములపై కన్ను శక్తిలో విలీనానికి రేవంత్ సర్కార్ కుట్ర

09-09-2026 | 12:58am

బిజెపి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తన ఆధీనంలో ఉన్న అన్ని శాఖల పనితీరు పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ డబ్బులు దండుకునే విషయంలో ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారని మేడ్చల్ నియోజకవర్గ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం మేడ్చల్ 297 వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆయన సందర్శించి శక్తి అంశంపై కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడినట్లు చెప్పారు.

అందులో బాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల భూములపై కన్నేసి సాంకేతిక విద్యాశాఖ ఉండాల్సిన పాలిటెక్నిక్ కళాశాలలను(Polytechnic College) శక్తి పేరుతో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ)ప్రైవేటీకరణ చేసే కుట్రను బిజేపి పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకూస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి విలీనం వల్ల విద్యార్థులకు బిటెక్ రెండవ సంవత్సరంలో చేరే అవకాశం మృగ్యం అవ్వడం వంటి అన్యాయపు విధానం పట్ల సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాశాఖ నుండి కార్మిక శాఖలో విలీనం పట్ల తమను స్కిల్డ్ లేబర్ గా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లుగా విద్యార్థిని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని వారి వర్ణాతీతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు