మన జగన్నాధపురం - మన సర్పంచ్

09-09-2026 | 12:35am

6వ వార్డులో పర్యటించిన సర్పంచ్ వినోద్

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulakalapalli Mandal) జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్(Sarpanch Kunja Vinod) మంగళవారం ఆరో వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.వార్డులో  సిసి రోడ్లు కావాలని స్థానికులు కోరగా త్వరలోనే మంజూరు అవుతాయని అప్పటివరకు గోతులు గ్రావెల్ తో నింపుతామని తెలిపారు.కోతుల బెడద నివారించడానికి ఏర్పాటు చేస్తున్న బోనును వార్డులోకి పంపిస్తానని ఆయన తెలిపారు. సమస్యలు ఏదైనా ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు. వర్షాకాలంలో జ్వరాలు ప్రబలకుండా స్వచ్ఛందంగా శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆరో వార్డు సభ్యురాలు కొవ్వాకుల మంగా గిరి,చేకుర్తి రామాచారి,బొల్లిపల్లి సురేష్,కత్రీ జంపన్న,బొమ్మకంటి రామ్,లక్ష్మణ్, వీరస్వామి బెజవాడ సావిత్రి,కత్రీ ఏసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు