మంథని అభివృద్ధి కనిపించకపోతే కళ్లున్నా కబోదివేనా

04-10-2026 | 05:01pm
  1. శ్రీధర్ బాబుపై విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ఘాటు కౌంటర్
  2. వ్యక్తిగత విమర్శలు మాని వాస్తవాలు తెలుసుకో
  3. మంథనిలో విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్

మంథని, అక్టోబర్ 04(విజయక్రాంతి) : మంథని అభివృద్ధిపై(Manthani Development) అవగాహన లేకుండా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Former MLA Putta Madhukar) చిల్లర రాజకీయ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధి పనులు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోకుండా మాట్లాడటం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.

మంథని పాత కూరగాయల మార్కెట్‌లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయిలీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాల వంటి అభివృద్ధి పనులు శ్రీధర్ బాబు చొరవతో జరుగుతున్నాయని తెలిపారు.

మంథనిలో జరుగుతున్న అభివృద్ధి కనిపించకపోతే అది ప్రజల తప్పు కాదు.. పుట్ట మధు చూపు సమస్య” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దుద్దిళ్ల కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధిపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని సూచించారు. శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని మరింత అభివృద్ధి చెందడమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రబోర్డు సభ్యులు శశి భూషణ్ కాచే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముసుకుల సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ఎల్లంకి శివ, ఎరుకల స్రవంతి, జంబోలు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు