పన్నూర్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం

23-11-2026 | 05:51pm
  1. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
  2. సహజసిద్ధ పూల బొకే, డ్రై ఫ్లవర్ ఫ్రేమ్‌తో జిల్లా కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికిన సర్పంచ్ చిందం మహేష్

రామగిరి,నవంబర్23(విజయ క్రాంతి): రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Panchayat Office) సర్పంచ్ చిందం మహేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం (Indiramma Family Insurance Scheme) ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మహేష్ కలెక్టర్‌కు సహజసిద్ధంగా తయారు చేసిన పూల బొకేతో పాటు డ్రై ఫ్లవర్ ఫ్రేమ్‌ను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. దరఖాస్తుల నమోదు, లబ్ధిదారుల వివరాలు, సర్వర్ వేగం, సాంకేతిక అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భద్రి శైలజ రాణి, రామగిరి మండల తహసీల్దార్ సుమన్, డిప్యూటీ తహసీల్దార్ మానస, ఎంపీఓ సమ్మిరెడ్డి, కార్యదర్శి ప్రేమలత, వార్డు సభ్యులు మున్ని అరుణ, ప్రశాంత్, ప్రదీప్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు