అభివృద్ధికి కోసం సింగరేణితో యుద్ధమే
- మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతిరమేష్ బాబు
- అభివృద్ధికి అడ్డంకిగా జిఎం రాధాకృష్ణ
- సింగరేణి ఖాళీ స్థలాలూ అప్పగించాలి
- రోడ్డు నిర్మాణ పనులకు సహకరించాలి
బెల్లంపల్లి: సింగరేణి యాజమాన్యం(Singareni Management) బెల్లంపల్లి అభివృద్ధి కి సహకరించకపోతే యుద్ధం తప్పదని బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్ బాబు హెచ్చరించారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణ రూపు రేఖలు మార్చేందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మార్గదర్శకత్వoలో లక్షల రూపాయలతో చేపట్టిన రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు సింగరేణి యాజమాన్యం మొకాడ్డూతున్నాదని మండిపడ్డారు.
రోడ్డు నిర్మాణం కోసం తలపెట్టిన పనులు సింగరేణి అధికారుల సహకారం కొరవడి ముందుకు వెళ్లలేకపోతున్నాయని వాపోయారు. విశాల రహదారుల నిర్మాణం కోసం వెడల్పు చేసిన నెలలు గడిచిపోతున్నదని తెలిపారు. మందమర్రి జిఎం రాధాకృష్ణ ఎమ్మెల్యే సమక్షంలో రోడ్డు వెడల్పు నిర్మాణ పనుల్లో సింగరేణి తన వంతు సహకారం అందిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగింపు కొంతమేరక జరిగిందన్నారు.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో సింగరేణి విద్యుత్ స్తంభాలు తొలగించడం లేవని ఆరోపించారు. అలాగే రోడ్డు కు అడ్డంగా ఉన్న ప్రాంతాల్లో గుంతలు పూడ్చే నిర్మాణ పనులు సింగరేణి చేయడంలేదని విమర్శించారు. సింగరేణి స్టోర్ గోడలు, సముదాయాలు రోడ్డు నిర్మాణ పనులకి అడ్డుగా ఉన్నాయని తెలిపారు. గోడలు తొలగిస్తేనే రోడ్డు విస్తరణ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ విషయంలో జిఎం అస్సలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లను సింగరేణి అడ్డుకుంటున్నదని అర్పించారు.
ఫలితంగా పట్టణంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం నత్తనడకన సాగుతున్నదని వాపోయారు. ఖాళీగా ఉన్న సింగరేణి స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని ఎన్నిసార్లు జిఎం రాధాకృష్ణ కలిసి కోరినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. పట్టణంలో సింగరేణి విద్యుత్ సరఫరాలో కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. బెల్లంపల్లి విద్యుత్ విభాగం సూపర్ వైజర్ పిల్లి శ్రీనివాస్ అరాచకాలు మరీ ఎక్కువయ్యాయని, పద్దతి మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని హెచ్చరించారు.
కార్మికకాలనీల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ, ప్రజలు, కార్మిక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ద్వజమెత్తారు. సింగరేణి అభివృద్ధిలో బెల్లంపల్లి ప్రజలు, కార్మికుల విశేషమైన పాత్రను సింగరేణి యాజమాన్యం మర్చిపోయిందని గుర్తు చేశారు. సింగరేణి గనుల కోసం ప్రజలు బొగ్గు ఉత్పత్తి వనరులను కోసం తమ జీవితాలను పణంగా పెట్టారని తెలిపారు..ఇక్కడి యువతీ యువకులు తమ భవిష్యత్ ను త్యాగం చేసారని తెలిపారు. ప్రజల సహకారం లేకుండా సింగరేణి మనుగడ, కార్యకలాపాలు ఇంతకాలం సాగేవి కావనే సత్యాన్ని జిఎం రాధాకృష్ణ గుర్తించుకోవాల న్నారు. ఖాళీగా ఉన్న సింగరేణి స్థలాలు, సముదాయాలు మునిసిపల్ కు అప్పగించి అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేశారు.
బెల్లంపల్లి అభివృద్ధికోసం కాంగ్రెస్ శ్రేణులు,సీనియర్ కాంగ్రెస్ నేతలు నేతృత్వంలో ఆందోళన చేస్తామని తెలిపారు. బెల్లంపల్లి అభివృద్ధి కోసం ఎంతటి పోరాటాలకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటినుంచి, అభివృద్ధి కోసమే పోరాటం, పోరాటమే అభివృద్ధి కోసం అనే నినాదంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. సింగరేణి తన వైఖరి మార్చుకొని అభివృద్ధికి తోడ్పాటును అందించక పోతే మందమర్రి జిఎం రాధాకృష్ణ పై ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ కలసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.