ట్యాంకు కిందపడి ఇద్దరు జవాన్లు మృతి
హర్యానాలోని హిసార్ జిల్లాలో సైనిక శిక్షణ (Military Training) విన్యాసాల సందర్భంగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సుమారు 32 ట్యాంకులతో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో (Military Exercises) ఈ దుర్ఘటన జరిగింది. ధూళి కారణంగా మార్గం సరిగా కనిపించకపోవడంతో ఓ ట్యాంకు అదుపుతప్పి ఇద్దరు సైనికులపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాయక్ మనీష్ కుమార్, నాయక్ అంకుశ్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే మిలిటరీ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటనపై ఆర్మీ అధికారులు (Army Officials), హిసార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైనిక విన్యాసాల సమయంలో జరిగిన ఈ విషాద ఘటనతో సైనిక వర్గాల్లో విషాదం నెలకొంది.