ఆత్మరక్షణకు కరాటే

23-11-2026 | 05:33pm

కోహెడ, నవంబర్ 23 (విజయక్రాంతి) : ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని కోహెడ శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్(Sri Adarsh ​​English Medium High School) ప్రిన్సిపల్ శైలజ, కరస్పాండెంట్ అంజయ్య పేర్కొన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. హుస్నాబాద్ లో నిర్వహించిన 3వ ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ కరాటే (ప్రెసిడెంట్ కప్) పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, ఆత్మరక్షణ, మానసిక బలంతో పాటు ఆరోగ్యం నియంత్రణలో ఉంటుందన్నారు.

ఆపదలో కమకు తాము రక్షించుకోవడంలో దోహదపడుతుందన్నారు. దీని ద్వారా క్రమశిక్షణ మరింత మెరుగు పడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ తో పాటు మెడల్స్ అందించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో తమ పాఠశాల విద్యార్థులకు మరింత శిక్షణ ఇప్పించి జిల్లా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా ప్రొచ్చహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు