ఆరోగ్యమే మహిళలకు అసలైన ఆస్తి!
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
చిన్ననాటి నుంచే ఆరోగ్య అలవాట్లు
ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): మహిళలు ఆరోగ్యం(Womens Health)పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని నేషనల్ హెల్త్ మిషన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్(National Health Mission Non-Government Organization) సుబ్రహ్మణ్యం, ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ జిల్లా ఇన్‌చార్జి అనూష సూచించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనూష , టి. శిరీష మాట్లాడుతూ.. మహిళలు(Womens) సమతుల్య ఆహారంతీసుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ పరిశుభ్రత పాటించడం, పోషకాహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.విద్యార్థినులు చిన్ననాటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.
వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం(Nutrition), శారీరక వ్యాయామం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించు కోవచ్చన్నారు.మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలుతీసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ , వైస్ ప్రిన్సిపాల్ సునీత, విద్యార్థినులు, పాల్గొన్నారు.