గణపురం మండల ఎంఆర్‌పీఎస్‌-టీఎస్‌ కమిటీ ఎన్నిక

16-09-2026 | 04:04pm

గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల ఎంఆర్‌పీఎస్‌-టీఎస్‌ కమిటీ ఎన్నిక  ఎంఆర్‌పీఎస్‌-టీఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి ఈదునూరి యాకయ్య ఆదేశాలతో బుధవారం గణపురం మండల(Ganapuram Mandal) కమిటీని ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌ రేణుకుంట్ల మహేష్‌ మాదిగ(District Convener Renukuntla Mahesh Madiga) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడిగా ల్యాదల్ల రాజశేఖర్‌, ఉపాధ్యక్షుడిగా మరుపట్ల ప్రభాస్‌, కార్యదర్శిగా బొచ్చు రాజుకుమార్‌, కోశాధికారిగా కొయ్యల కార్తిక్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా మరుపట్ల సిద్దు, సన్నీ, రోహిత్‌, మధుకర్‌, రాజు, సురేష్‌, మహేష్‌, బాబు, రవిలను ఎంపిక చేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు రాజశేఖర్‌ను శాలువాతో సత్కరించారు.

మరిన్ని వార్తలు