రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఆల్ఫోర్స్ విద్యార్థులు
సుల్తానాబాద్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు ప్రాయోగిక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో విద్యార్థులను రైల్వే స్టేషన్(railway station) సందర్శనకు తీసుకెళ్లినట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు స్థానిక రైల్వే స్టేషన్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను కేవలం చదువులకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు. అందులో భాగంగానే విద్యార్థులను రైల్వే స్టేషన్ సందర్శన కోసం తీసుకెళ్లడంజరిగిందన్నారు. రైళ్లరాకపోకలు,ప్రయాణికులకు అందించే సేవలు, రైల్వే సిబ్బంది నిర్వహించే విధుల పట్ల అవగాహన పెంచామని తెలిపారు. ఇటువంటి విద్యా పర్యటనల ద్వారా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంపెంపొందుతుందన్నారు.
నిత్యజీవితంలో ఉపయోగపడే అంశాలపై అవగా అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా రైల్వే స్టేషన్ లోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ, పలు విషయాలను తెలుసుకున్నారని విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమము ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.