ఘనంగా అభిలాష్ జన్మదిన వేడుకలు
వికలాంగులకు అన్నదానం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్(Sultanabad) పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రం(Centers for Mentally Challenged)లో శనివారం కొమురవెల్లి లక్ష్మీ భాస్కర్ దంపతుల చిన్న కుమారుడు అభిలాష్ (యుఎస్ఎ) పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగులు ఆనందం వ్యక్తం చేస్తూ అభిలాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ జన్మదినాన్ని,పెళ్లిరోజులను పురస్కరించుకొని వికలాంగులకు అన్నదానం చేయడం, వారి మధ్య వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమం లో కందుకూరి ప్రకాష్ రావు ( పెద్దన్న ), తాటిపల్లి భూపతి, కత్తెర్ల చందర్ , ముంజ శ్రీనివాస్ , నందాల శ్రీనివాస్, కొమురవెల్లి హరీష్ , గజ బింకర్ భరత్, దేశెట్టి రమేశ్, వికలాంగుల కేంద్రం ఇంచార్జ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.