రిటైర్డ్ హోంగార్డు కుటుంబానికి పోలీసుల ఆర్థిక చేయూత
19-10-2026 | 06:08pm
చిట్యాల, అక్టోబర్ 19 (విజయక్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన రిటైర్డ్ హోంగార్డు రంగాపురం వెంకన్న కుటుంబానికి సోమవారం నార్కట్పల్లి పోలీస్(Narkatpally Police) సిబ్బంది రూ.61 వేల ఆర్థిక సహాయం అందించారు. నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత సీఐ ఎస్. సురేష్, గతంలో పనిచేసిన సీఐ కె. నాగరాజు, ఎస్ఐ పి. విష్ణుమూర్తి, పోలీస్ సిబ్బంది కలిసి ఈ మొత్తాన్ని సేకరించారు. సేకరించిన నగదును సీఐ సురేష్ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. తోటి సిబ్బంది కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలవడం పోలీస్ శాఖలోని ఐక్యత, సహోదరభావం, మానవతా విలువలకు నిదర్శనమని పలువురు అభినందించారు.