బోధన్ జిల్లా ఆస్పత్రిలో కలెక్టర్ సమీక్ష

18-09-2026 | 12:30pm

బోధన్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) ఆదేశాల మేరకు బోధన్ జిల్లా ఆస్పత్రి(Bodhan District Hospital)లో పక్షం రోజుల సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశానికి బోధన్ ఆర్డీఓ ఎం. విజయ కుమారి హాజరై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాహుల్‌తో కలిసి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ(Sanitation management), శానిటేషన్, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసవాల నిర్వహణ, తల్లి–శిశు సంరక్షణ, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రసవాల కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ సూచించారు. వైద్యులు, సిబ్బంది విధులకు సక్రమంగా హాజరై రోగులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.

ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని విజయ కుమారి సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాహుల్, వైద్యులు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు