రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన భవ్యరాణి

29-09-2026 | 08:43pm

సంస్థాన్ నారాయణపూర్,సెప్టెంబర్ 29(విజయ క్రాంతి):సంస్థాన్ నారాయణపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సింగం భవ్యరాణి రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో(School Games Federation of India) భాగంగా సోమవారం నల్లగొండలోని మేకల అభినవ్ ఇండోర్ స్టేడియం లో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.

సింగం భావ్యరాణి ఎంపిక పట్ల నారాయణపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేగట్టే రమాదేవి, గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మెన్ బి.మంగ,వ్యాయామ ఉపాధ్యాయురాలు కళావతి,ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు