కార్యకర్త అంత్యక్రియల్లో పాల్గొన్న సండ్రుగు శ్రీకాంత్

29-09-2026 | 08:46pm

చేగుంట సెప్టెంబర్ 29, (విజయక్రాంతి): చేగుంట మండలం చిట్టొజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరుట్ల పెద్ద కొండా స్వామి మృతిచెందిన విషయం తెలుసుకొని, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు వారి భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని  పాడేమోసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు