వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి

18-09-2026 | 06:52pm

నిర్మల్ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రీప్ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లలకు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న(District Educational Officer Darshanam Bhojanna) సందర్శించారు. పూర్వప్రాథమిక విద్యార్థులకు ఆట, పాటలతో బోధన చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడుపడాలి. అంతేకాకుండా పూర్వప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు పెద్ద సంఖ్యలో పెంచాలి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థుల నమోదులో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పడం జరిగింది. పూర్వ ప్రాథమిక విద్యను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఇన్స్ట్రక్టర్లలను అభినందించడం జరిగింది.

మరిన్ని వార్తలు