ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వానం
నిర్మల్ నవంబర్ 12 ( విజయ క్రాంతి): కేంద్ర యువజన వ్యవహారాలు(Union Ministry of Youth Affairs), క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మేరా యువ భారత్ – నిర్మల్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026–27 కార్యక్రమానికి బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Eleti Maheshwar Reddy) గారికి జిల్లా యువజన అధికారి రమేష్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ కార్యక్రమం నవంబర్ 13, 2026న నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు పాల్గొని, 'నషా ముక్త యువ వికసిత్ భారత్' అనే అంశంపై మూడు నిమిషాల పాటు తమ అభిప్రాయాలను సభలో వ్యక్త పరచనున్నా రు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించనున్నారు.
యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.