ఉద్యోగులకు శిక్షణ తరగతులు
నిర్మల్ నవంబర్ 5 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్(Collectorate) సమీకృత భవన్లో డిజిటల్ గవర్నమెంట్ లో భాగంగా ఈ కార్నర్ ఈ సాంక్షన్ వామిస్ మాడ్యూల్(Sanction Vamis Module) పై ఇస్తున్న శిక్షణను ప్రతి ఒక్కరు సద్వినించుకోవాలని జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ అన్నారు.
మూడు రోజుల శిక్షణలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ విధానంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను పాటించేందుకు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా పే అండ్ అకౌంట్ అధికారి చంద్రశేఖర్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ టి ఓ దాత్రిక రమేష్ ముధోల్ ఎస్ టి ఓ జయరాం గురు, బైంసా ఎస్ టి ఓ నజీమ్, ఖానాపూర్ ఎస్టిఓ మనోహర్ శశి తోట సృజన్ తదితరులు పాల్గొన్నారు