చేయూత పింఛన్ దరఖాస్తులను పరిశీలించిన

05-11-2026 | 07:35pm

చేగుంట నవంబర్ 05.విజయక్రాంతి: చేగుంట మండలంలోని చందాయిపేట, పెద్ద శివునూరు, చిన్న శివునూరు  గ్రామపంచాయతీలో(Chinna Shivunuru Grama Panchayat) చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను  జిల్లా సీఈఓ ఎల్లయ్య, ఎంపీడీవో చిన్నారెడ్డి తో కలిసి  పింఛన్ దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

దరఖాస్తుదారుల అర్హతలు, సమర్పించిన పత్రాలు, ఇతర వివరాలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లు అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శులు కృష్ణ, రాజు, శ్రీకాంత్  సర్పంచులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు