గౌడ ఐక్య సాధన సమితి
05-11-2026 | 07:28pm
భూపాలపల్లి, నవంబర్ 05 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గౌడ ఐక్య సాధన సమితి(Gowda Unity Achievement Committee) జిల్లా అధ్యక్షుడిగా బత్తిని శివశంకర్ గౌడ్ ఎంపికయ్యారు. రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గౌడ సంఘాన్ని బలోపేతం చేస్తూ, గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు.