విద్యార్థుల ర్యాలీ

28-09-2026 | 08:23pm

నిర్మల్,(విజయక్రాంతి): సోన్ మండలం పాక్పట్ల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ లక్ష్యం  వికసిత భారత్(Viksit Bharat Vision)లో భాగంగా నషా ముక్త్ యువ కార్యక్రమం(Drug-free youth program)లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను, అనర్థాలను ప్రధానోపాధ్యాయురాలు పి.మమత వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్, రాథోడ్ బలిరాం, వెల్మల రత్నాకర్, దాడోల్ల అరుణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు