డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె
02-11-2026 | 05:58pm
నిర్మల్ నవంబర్ 2 ( విజయ క్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్ లో(National Health Mission) విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని పేర్కొన్నారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 21వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వారు నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు పెంచాలని ప్రసూతి సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ శోభ నారాయణ గంగాధర్ తదితరులు ఉన్నారు.