పోటాపోటీగా దరఖాస్తులు
03-10-2026 | 06:11pm
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వైద్య శాఖ(Medical Department) ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న వైద్యులు, ఏఎన్ఎంలు, ఫార్మసీ ఉద్యోగుల(Pharmacy employees) కోసం దరఖాస్తులు జోరుగా సాగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తుల ప్రక్రియలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ పరిశీలించారు. సోమవారం వరకు దరఖాస్తుల గడువు అవకాశం ఉందని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.