నేరాల నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలి

17-10-2026 | 06:08pm

నిర్మల్, అక్టోబర్ 17( విజయక్రాంతి) : జిల్లాలో నేరాల నియంత్రణ(Crime Control), మత్తు పదార్థాల నిర్మూలన(Eradication of Narcotic Substances), శాంతి భద్రతల పరిరక్షణ ట్రాఫిక్ సమస్య తదితర అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(District Collector Bhavesh Mishra), జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, ప్రమాదాల నివారణ ట్రాఫిక్ సమస్యలు(Traffic problems) ఆర్థిక నేరాల నియంత్రణ తదితర అంశాలపై జిల్లా పోలీస్ సిబ్బందికి అధికారులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలను తగ్గించుకునేందుకు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. అదనపు ఎస్పి ఉపేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ వెంకట మాధవరావు ఏఎస్పీ సాయికిరణ్ సబ్ కలెక్టర్ జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు