ఎకానమీ నాలెడ్జ్ తప్పనిసరి!
నిర్మల్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘నేటి సమాజంలో అర్థశాస్త్ర పరిజ్ఞాన ఆవశ్యకత’ అనే అంశంపై ఎక్స్‌టెన్షన్ లెక్చర్(Extension Lecture) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు లెఫ్టినెంట్ డాక్టర్ వై. వేణు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆర్థిక అంశాలపై కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. డిజిటల్ యుగంలో(Digital Era) మన కొనుగోలు నిర్ణయాలను ఏఐ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు(Online Platforms) ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనే అంశంపై విద్యార్థులకు ఆయన వివరణాత్మక విశ్లేషణ అందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్, అర్థశాస్త్ర విభాగాధిపతి కుంట శ్రీహరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు. గంగాధర్, అధ్యాపకులు డాక్టర్ పి.జి. రెడ్డి, డాక్టర్ టి. శ్రీనివాస్, కె. రమేష్, డాక్టర్ హేమలత, డాక్టర్ కె. సూర్యసాగర్, విద్యార్థులు పాల్గొన్నారు.