విజ్ఞాలు పోవాలి... విజయం చేకూర్చాలి
24-09-2026 | 06:37pm
కర్ర గణపతికి కలెక్టర్ పూజలు
కుబీర్ ( విజయ క్రాంతి):నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామంలో నెలకొల్పబడ్డ కర్ర మోక్ష గణపతిని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా(District Collector Bhavish Mishra) గురువారం సందర్శించి పూజలు నిర్వహించారు. అప్పటి గణపతి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్మించుకోవడం అభినందనీయమని తెలిపారు. ఈ సంవత్సరం విజ్ఞాలు తొలగించి విజయాలు ప్రసాదించే విధంగా జిల్లా ప్రజలను ఆశీర్వదించాలని గణపతిని వేడుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్కు సన్మానం చేసి గణపతి ప్రసాదం అందించారు . ఈ కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ సాంకేతి కుమార్ ఆలయ కమిటీ సభ్యులు అధికారులు ఉన్నారు