ఐకే ఓసీని సందర్శించిన డైరెక్టర్ పీపీ
24-09-2026 | 07:16pm
నస్పూర్, (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కే వెంకటేశ్వర్లు (Singareni Director K. Venkateswarlu)శ్రీరాంపూర్ ఏరియా పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఓసీనీ గురువారం సందర్శించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాయంలో శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ సమక్షంలో గని అధికారులతో ప్లాన్ పరిశీలించి ఉత్పత్తి, ఉత్పాదకత తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గని లోపల పని ప్రదేశాలకు వెళ్లి అక్కడ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. కావాల్సిన యంత్రాలు, పనిముట్లు సమకూర్చుకొని నిరంతరాయ ఉత్పత్తికి కృషిచేయాలని ఆదేశించారు. వీరి వెంట ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ రామకృష్ణ, మేనేజర్(ఆపరేషన్స్) శంకర్, రక్షణ అధికారి మహేష్, సర్వేయర్ కేవీ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.