గోదావరి పుష్కరులపై ఏర్పాట్ల ముమ్మరం
నిర్మల్,(విజయక్రాంతి): 2027లో జరిగే గోదావరి పుష్కరాలు, బాసర ఆలయ అభివృద్ధి(Basara Temple Development) పనులు మాస్టర్ ప్రణాళిక పనుల్లో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా(Collector Bhavish Mishra) అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) అధికారులతో కలిసి ఏర్పాట్ల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు వచ్చే సంవత్సరం నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై సమన్వయ సమావేశంలో చర్చించారు.
పుష్కర ఘాట్ల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ తదితర భద్రతా చర్యలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఐపిఎస్ నీటిపారుదల, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ ఈఈలు అనిల్, సుభాష్, సందీప్, బాసర ఆలయ ఈఓ అంజనా దేవి, శంకరయ్య, ఇతర శాఖల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.