విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

11-09-2026 | 12:20pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్(Telangana Vaidya Vidhana Parishad), కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఆర్‌బీఎస్‌కే వైద్యులు డాక్టర్ నరేందర్, వైద్య బృందం విద్యార్థులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల రిపోర్టుల ఆధారంగా దృష్టి లోపం ఉన్న 20 మంది విద్యార్థులకు తగిన కళ్లజోళ్లను ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం మాట్లాడుతూ మరో 15 రోజుల్లో తిరిగి ఆర్‌బీఎస్‌కే వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, రాజన్న, గురుకుల నర్సింగ్ ఆఫీసర్ ముదిమడుగుల శ్యామ్ చందర్, అధ్యాపకులు కోసరి మహేష్, రాజకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు