బీఆర్ఎస్‎కు ప్రభుత్వం భయపడుతోంది: వెన్న అశోక్‌కుమార్

11-09-2026 | 12:32pm

అధికార పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తే భయమేస్తుంది

అశ్వాపురం, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణలో అధికార పార్టీ అరాచక పాలన సాగిస్తోందని పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్‌కుమార్ ఆరోపించారు.శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ  కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో పాటు, పలు కారణాలు చూపుతూ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు.

అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతోనే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఎన్ని అమలు చేశారో అసెంబ్లీలో చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం దళిత నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలు ప్రజల మేలు కోసం పనిచేయాలని, ప్రజలను మభ్యపెట్టే విధానాలకు స్వస్తి పలకాలని అశోక్‌కుమార్ సూచించారు.

మరిన్ని వార్తలు