కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న రైల్వే ఐజీ
16-09-2026 | 03:07pm
కొమురవెల్లి,(విజయక్రాంతి): కొమురవెల్లి మల్లికార్జున స్వామి(Komuravelli Mallikarjuna Swamy)ని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ఐజి అమోరా సింగ్ ఠాకూర్, ఎస్పి దేవాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ(SP Devasmita Chattopadhyay Banerjee) దర్శించుకున్నారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహణాధికారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వర్గాలు వారికి స్వామివారి ప్రసాదం తో పాటు శేష వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.