బాసరలో రైలు ఢీకొని వ్యక్తి మృతి
09-09-2026 | 11:21am
బాసర: బాసర్‌లోని(Basara) రైల్వే వంతెన సమీపంలో రైలు ఢీకొనడంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 55 ఏళ్లు ఉంటాయని, అతను నీలం రంగు ప్యాంటు, వెండి రంగు టీ-షర్ట్ ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు(Railway Police) తెలిపారు. మృతుడు మహారాష్ట్రకు చెందినవాడు కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం పరీక్ష కోసం మృతదేహాన్ని నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి(Government Hospital in Nizamabad) తరలించారు. మరణించిన వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గరైనా ఉంటే వారు రైల్వే పోలీసులను సంప్రదించవచ్చని రైల్వే ఏఎస్‌ఐ మహబూబ్ ఖాన్ తెలిపారు.