సౌర విద్యుత్‌తో విద్యుత్‌ వ్యయం గణనీయంగా తగ్గింపు

19-09-2026 | 03:54pm

పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ఆదర్శ్‌ సురభి

వనపర్తి, ( విజయక్రాంతి) : సౌర విద్యుత్‌ వినియోగంతో గృహాలు, కార్యాలయాల్లో విద్యుత్‌ వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్‌ సురభి (District Collector Adarsh ​​Surabhi) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్‌–ముఫ్త్‌ బిజ్లీ యోజన పథకాన్ని(PM Surya Ghar-Muft Bijli Yojana scheme) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్‌ వినియోగం ద్వారా విద్యుత్‌ పొదుపుతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. వనపర్తి ఐడీఓసీలో సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేసిన అనంతరం విద్యుత్‌ బిల్లుల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందన్నారు.

సౌర విద్యుత్‌ ఏర్పాటుకు ముందు 2025 జనవరి నుంచి జూన్‌ వరకు ఆరు నెలల్లో రూ.14.53 లక్షలుగా ఉన్న విద్యుత్‌ బిల్లులు, అనంతరం ఆరు నెలల్లో రూ.9.85 లక్షలకు తగ్గినట్లు తెలిపారు. దీంతో ఆరు నెలల్లో రూ.4,67,903 విద్యుత్‌ వ్యయం ఆదా అయిందన్నారు. ప్రజలు తమ ఇళ్లపై రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలని కలెక్టర్‌ కోరారు.

మరిన్ని వార్తలు