చిన్నారులు మృతి పట్ల త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం
ముకరంపుర, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి(RIMS Hospital)లో అర్థరాత్రి ఏసి యూనిట్ పేలి సంబంధించిన అగ్ని ప్రమాదం ఘటనపై బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారి శిశువులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. మిగతా చికిత్స పొందుతున్న 23 మంది చిన్నారులకు నాణ్యమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. ఇంత పెద్ద ఆసుపత్రికి ఒకే డ్యూటీ డాక్టర్ ఉంటారా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ల నియామకం చేపట్టాలని సూచించారు.
జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు తీరుస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం చిన్నారుల మృతి చెందిన పట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు తక్షణమే ఆర్థిక సహాయాన్ని చేయాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు.